ట్రంప్‌ డైలాగ్‌ ఎక్కడో విన్నట్టుందే: చిదంబరం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల ముఖాముఖిలో చెప్పిన మాటలు .. భారత్‌లో ఎవరినో గుర్తుచేస్తున్నాయి అంటున్నారు కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం. ట్రంప్‌, డెమొక్రాట్‌ అభ్యర్థి జో బైడెన్‌ మధ్య ఇటీవల తొలి ముఖాముఖి చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ చర్చలో ట్రంప్‌ మాట్లాడుతూ

Published : 01 Oct 2020 14:39 IST

దిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల ముఖాముఖిలో చెప్పిన మాటలు .. భారత్‌లో ఎవరినో గుర్తుచేస్తున్నాయి అంటున్నారు కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం. ట్రంప్‌, డెమొక్రాట్‌ అభ్యర్థి జో బైడెన్‌ మధ్య ఇటీవల తొలి ముఖాముఖి చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ చర్చలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘47ఏళ్లు మీరు(డెమొక్రాట్లు) అధికారంలో ఉండి చేసిన దానికంటే ఈ 47 నెలల్లో నేను ఎంతో ఎక్కువ చేశాను’ అని అన్నారు. కాగా.. దీనిపై చిదంబరం స్పందిస్తూ.. ‘ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు భారత్‌లో ఎవరినైనా గుర్తుచేస్తున్నాయా? అది మీ ఊహకే వదిలేస్తున్నా’ అని ట్వీట్ చేశారు. 

2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో మోదీ కాంగ్రెస్‌ పార్టీని విమర్శిస్తూ.. ‘60 ఏళ్ల పాలనలో ఆ పార్టీ ఏమీ చేయలేదు. కానీ నాకు 60 నెలల సమయం ఇవ్వండి’ అని అన్నారు. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో మోదీ సహా భాజపా నేతలు.. 60 ఏళ్లలో వారు(కాంగ్రెస్‌) చేయలేనిది 60 నెలల్లో మేం చేసి చూపించాం’ అని కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు. ఈ వ్యాఖ్యలనే చిదంబరం పరోక్షంగా ప్రస్తావించినట్లు కన్పిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని