Updated : 07 Jul 2022 11:56 IST

Chintamaneni: కోడిపందేల్లో లేని వ్యక్తిని చూపించడం కొందరి జెండా.. అజెండా: చింతమనేని

దెందులూరు: రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలని తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. హైదరాబాద్‌ శివారు పటాన్‌చెరులో నిర్వహించిన కోడి పందేల వ్యవహారంలో ఆయన ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చింతమనేని సోషల్‌ మీడియాలో స్పందించారు.  

‘‘కోడి పందేల్లో లేని వ్యక్తిని ఉన్నట్లు చూపించడం కొందరి జెండా.. అజెండా. ఇంత రాక్షస రాజకీయం అవసరమా? రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలి. నీచమైన ప్రచారంతో కుప్పకూలే మేడలు కట్టి అధికారంలోకి వచ్చారు. తెలుగు ప్రజల్లో విష బీజాలు నాటి నాడు అధికారం చేపట్టారు. ఆ మేడలు కూలిపోయే సమయం ఆసన్నమైంది. అసత్యాల ‘సాక్షి’ని ప్రజలు కూకటివేళ్లతో ప్రక్షాళన చేసే సమయం వచ్చింది. ఆరోజు కోసమే తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు. మీ రాక్షస రాజకీయ వికటాట్టహాసానికి ముగింపు త్వరలోనే..’’ అని చింతమనేని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని