Chirag Paswan: పార్టీ అధ్యక్ష పదవి కూడా దూరం

బిహార్‌లో లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ)లో ఏర్పడిన అసమ్మతి చిరాగ్ పాసవాన్‌ను క్రమంగా పార్టీకి దూరం చేస్తోంది.

Published : 15 Jun 2021 19:53 IST

దిల్లీ: బిహార్‌లో లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ)లో ఏర్పడిన అసమ్మతి చిరాగ్ పాసవాన్‌ను క్రమంగా పార్టీకి దూరం చేస్తోంది. పార్టీలో ఒంటరిగా మారిన ఆయన అధ్యక్ష పదవిని కూడా కోల్పోయారు. ‘ఒక వ్యక్తి, ఒకే పదవి’ అనే సిద్ధాంతం కింద చిరాగ్‌ను తొలగించినట్లు తిరుగుబాలు ఎంపీలు వెల్లడించారు. అత్యవసర సమావేశంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎల్జేపీ పార్లమెంటరీ పార్టీ నేత, జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటరీ బోర్డు ఛైర్మన్‌..ఇలా పార్టీ పదవులన్నీ ఆయనే నిర్వహించేవారన్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి సూరజ్ భాన్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. త్వరలో జరిగే కార్యనిర్వాహక సమావేశంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. 

పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో ఎల్జేపీకి చెందిన ఆరుగురు ఎంపీల్లో ఐదుగురు నిన్న తిరుగుబావుటా ఎగురవేశారు. గత కొంత కాలంగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న ఎల్జేపీ ఎంపీలు..పార్లమెంటరీ నేతగా పశుపతి కుమార్ పరాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు తమను వేరే గ్రూప్‌గా గుర్తించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. చిరాగ్‌ రాజీ కోసం ప్రయత్నించినా సఫలం కాలేదు. ‘నా తండ్రి, నా కుటుంబం ఏర్పాటు చేసిన పార్టీని ఐక్యంగా ఉంచేందుకు నేను చాలా ప్రయత్నించాను. కానీ విఫలమయ్యాను. పార్టీ ఒక తల్లి లాంటిది. ఎప్పుడూ ద్రోహం చేయకూడదు’ అంటూ తన రాజీనామా లేఖలో వ్యాఖ్యానించారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని