Chiranjeevi: రాజకీయాలకు దూరంగా ఉన్నా: చిరంజీవి

రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని ప్రముఖ సినీనటుడు చిరంజీవి స్పష్టం చేశారు. చిరంజీవికి వైకాపా రాజ్యసభ సీటు ఇస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన

Updated : 14 Jan 2022 19:02 IST

విజయవాడ: రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని ప్రముఖ సినీనటుడు చిరంజీవి స్పష్టం చేశారు. చిరంజీవికి వైకాపా రాజ్యసభ సీటు ఇస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాను పదవులకు లోబడే వ్యక్తిని కాదని పేర్కొన్నారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలు ఊహాజనితమేనని, వాటిని ఖండిస్తున్నట్టు చెప్పారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని, వాటిని కోరుకోనని తెలిపారు. పదవులు కోరుకోవడం తన అభిమతం కాదని చిరంజీవి వెల్లడించారు. సినీ పరిశ్రమకు చెందిన సమస్యలపై చర్చించేందుకు చిరంజీవి నిన్న మధ్యాహ్నం ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. దీంతో చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తున్నట్టు ప్రచారం జరిగింది. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు కృష్ణా జిల్లా డోకిపర్రు వెళ్తున్న చిరంజీవిని రాజ్యసభ సీటు గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఈమేరకు ఆయన స్పందించారు. డోకిపర్రులో ప్రముఖ పారిశ్రామికవేత్త మెగా కృష్ణారెడ్డి ఇంట్లో గోదాదేవి కల్యాణోత్సవానికి చిరు హాజరయ్యారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని