
Andhra News: చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి నారాయణ తరలింపు
చిత్తూరు: చిత్తూరు వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో నమోదైన కేసులో అరెస్టు అయిన నారాయణ విద్యా సంస్థల ఛైర్మన్ నారాయణను పోలీసులు మంగళవారం రాత్రి వైద్య పరీక్షల నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యపరీక్షల పూర్తి అయిన తర్వాత చిత్తూరు నాలుగో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. అంతకుముందు చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి నారాయణపై కేసుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. ‘‘ఉదయం నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ నారాయణను అదుపులోకి తీసుకున్నాం. గత నెల 27న పదో తరగతి తెలుగు ప్రశ్న పత్రం వాట్సాప్ గ్రూపులో సర్క్యులేట్ అయిందని డీఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఈ కేసుకు సంబంధించి ఏడుగురిని అరెస్టు చేశాం. విచారణలో భాగంగా నిందితులకు పోలీసు కస్టడీకి తీసుకున్నాం. దర్యాప్తులో భాగంగా లభించిన వివరాలు, సాంకేతిక ఆధారాలు, నిందితుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా సరైన విధానంలో నిబంధనల ప్రకారమే నారాయణను అదుపులోకి తీసుకున్నాం.
ప్రవేశాల సంఖ్య పెంచుకోవడంలో భాగంగా పేపర్ లీక్ చేసినట్లు తెలుస్తోంది. ఇన్విజిలేటర్లు ఏఏ సెంటర్లల్లో ఎవరెవరు ఉంటారనే సమాచారాన్ని ముందుగానే సేకరించారు. వీరిలో ఎవరెవరిని లోబర్చుకోవచ్చో తెలుసుకున్నారు. వీరి దగ్గర చదివే విద్యార్థులను రెండు విభాగాలుగా విభజించారు. బాగా చదివేవారు.. చదవని వారిగా విభజించారు. ఏఏ సెంటర్లలో ఈ పిల్లలున్నారో ముందుగా మాట్లాడుకున్న వారి ద్వారా ప్రశ్న పత్రం లీకేజీకి పాల్పడినట్లు తెలిసింది. పరీక్ష కేంద్రంలో ఉన్న ఒక ఉపాధ్యాయుడి ద్వారా ప్రశ్న పత్రాన్ని ఫొటో తీసి, వాటికి సమాధానాలు రాసి తిరిగి లోపలికి పంపించేందుకు ప్రయత్నించారు. గతంలో కూడా వీరు ఇలాంటి ప్రాక్టీస్‌కి పాల్పడినట్లు మా దర్యాప్తులో తేలింది. గత రెండేళ్లుగా కరోనా వల్ల పరీక్షలు నిర్వహించలేదు. ఈ ఏడాది మళ్లీ పరీక్షలు రావడం.. ఒత్తిడి ఎక్కువై మంచి మార్కులు తీసుకురావాలనే దురాలోచనతో ఈ మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు.
ప్రశ్న పత్రం తీసుకున్న తర్వాత వాటి కీ రెడీ చేసి అటెండర్స్, వాటర్ బాయ్స్, ముందుగానే ప్రలోభాలకు గురైన ఉపాధ్యాయుల ద్వారా సమాధానాలు లోపలికి పంపించేలా గతంలో ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. అదే ప్రక్రియను ఈసారి కూడా చేయబోయారు. ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా విషయం బయటకు వచ్చింది. దర్యాప్తులో భాగంగా మరిన్ని విద్యాసంస్థల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే పట్టుబడిన నిందితుల గత చరిత్రను పరిశీలిస్తే వీరంతా గతంలో నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసినట్లు గుర్తించాం. 2008 నుంచి నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసి 2014, 2015లో బయటకు వచ్చి వేర్వేరు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నట్లు తేలింది. ఈ కేసుకు సంబంధించి మిగతా విద్యా సంస్థల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తాం. విచారణలో ఉన్నందున ప్రస్తుతం ఈ కేసులో నారాయణ పాత్ర, వాంగ్మూలంలో వివరాలు ఇప్పుడు వెల్లడించలేం. నారాయణ సతీమణిని పోలీసులు అరెస్టు చేయలేదు. దర్యాప్తులో భాగంగా ఏడుగురిని అరెస్టు చేశాం. ఇవాళ నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ నారాయణను, తిరుపతిలోని విద్యాసంస్థల డీన్ బాలగంగాధర్‌ను అదుపులోకి తీసుకున్నాం. వీరిని న్యాయస్థానంలో హాజరుపరిచి తదుపరి విచారణ కొనసాగిస్తాం’’ అని ఎస్పీ వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
HMDA: ప్రారంభమైన రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల లాటరీ ప్రక్రియ
-
India News
India Corona: తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరిగిన కొత్త కేసులు..
-
General News
Telangana news: కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. తప్పిన ప్రమాదం
-
Business News
Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 700+
-
Related-stories News
Prince Charles: ఖతర్ నుంచి నగదు రూపంలో విరాళాలు తీసుకున్న ప్రిన్స్ ఛార్లెస్
-
Business News
GST: క్యాసినోలు, ఆన్లైన్ గేమింగ్‌పై 28% జీఎస్టీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- చెరువు చేనైంది
- Dharmana Prasada Rao: పార్టీపై ఆధారపడి బతకొద్దు
- Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Road Accident: నుజ్జయిన కారులో గర్భిణి నరకయాతన