Chandrababu: శాఖలపై పట్టు పెంచుకోవాలి.. మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

సచివాలయంలో జలవనరులశాఖ అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.

Published : 14 Jun 2024 20:40 IST

అమరావతి: సచివాలయంలో జలవనరులశాఖ అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం సహా వివిధ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సీఎం సందర్శించే అవకాశమున్నట్టు సమాచారం. మరో వైపు శ్వేత పత్రాలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత పాలనకు ఇప్పటికీ భిన్నత్వాన్ని చూపించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు సచివాలయంలోనే ఉండాలని, కచ్చితంగా సమయ పాలన పాటించాలని నిర్ణయించారు. జిల్లాల్లో, నియోజకవర్గాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాక తొలి క్యాబినెట్‌ భేటీ నిర్వహించే అవకాశముంది. పోలవరం పర్యటన పూర్తయ్యాక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతి రోజు సచివాలయానికి రావాలని తనను కలిసిన మంత్రులకు సీఎం సూచించారు. శాఖలపై పట్టు పెంచుకోవాలని, పాలనా పరంగా పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలని మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని