Jagan-Chandrababu: నంబూరుకు జగన్.. చంద్రబాబు పర్యటనపై సందిగ్ధత
ఏపీ సీఎం జగన్ గురువారం సాయంత్రం నంబూరులోని మదర్సాలో ఏర్పాటు చేసిన తాత్కాలిక హజ్ హౌస్‌కు రానున్నారు. అయితే, తెదేపా అధినేత చంద్రబాబు కూడా ఇక్కడికి వస్తున్నట్లు షెడ్యూల్ ఖరారు చేశారు.

నంబూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం 5గంటలకు గుంటూరు జిల్లాలోని నంబూరుకు రానున్నారు. ఇక్కడి మదర్సాలోని తాత్కాలిక హజ్ హౌస్ వద్దకు ఆయన వెళ్లనున్నారు. అయితే, తెదేపా అధినేత చంద్రబాబు కూడా సాయంత్రం మదర్సాకు రావాలని భావించారు. ఈ మేరకు సాయంత్రం 5.30గంటలకు చంద్రబాబు వస్తున్నట్లు షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పర్యటన దృష్ట్యా చంద్రబాబు పర్యటనకు అనుమతిపై సందిగ్ధత నెలకొంది.
ప్రతి ముస్లిం తన జీవితంలో కచ్చితంగా అనుసరించాల్సిన ఐదు నియమాల్లో హజ్ యాత్ర ఒకటి. ఇస్లాం ధర్మంలో ఒకసారి హజ్ వెళ్లడం తప్పనిసరి. బక్రీద్ నెలలో చేసే యాత్ర హజ్ అని, సాధారణ రోజుల్లో చేసే యాత్ర ఉమ్రా అని పిలుస్తారు. ఈ ఏడాది హజ్ యాత్రకు రాష్ట్రం నుంచి 2,000 మందికిపైగా వెళ్తున్నారు. తొలిసారి గన్నవరం విమానాశ్రయం నుంచి ముస్లిం సోదరులు వెళ్లనున్నారు. యాత్ర చేయబోయే అందరికీ పెదకాకాని మండలంలోని నంబూరు మదర్సాలో వసతి ఏర్పాట్లు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ODI WC 2023: ప్రపంచకప్ స్క్వాడ్ ఫైనలయ్యేది నేడే.. ఆ ఒక్కరు ఎవరు?
-
EVs: ఈవీ కొనాలనుకుంటున్నారా? వీటినీ దృష్టిలో పెట్టుకోండి..
-
Fake News: ఎక్స్ కీలక నిర్ణయం.. నకిలీ వార్తలపై ఫిర్యాదు ఫీచర్ తొలగింపు..!
-
Manipur Violence: మణిపుర్లో మళ్లీ కల్లోలం.. పుల్వామా దర్యాప్తు ఐపీఎస్ అధికారికి పిలుపు..
-
Prabhas: ప్రభాస్ మైనపు విగ్రహంపై క్లారిటీ ఇచ్చిన మ్యూజియం నిర్వాహకులు..
-
Justin Trudeau: ‘మేం చేసింది ఘోర తప్పిదం.. క్షమించండి’: కెనడా ప్రధాని ట్రూడో