దిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్‌ దిల్లీ పర్యటనకు వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరారు. రాత్రి 10 గంటలకు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఆయన భేటీ కానున్నారు.

Updated : 19 Jan 2021 16:35 IST

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ దిల్లీ పర్యటనకు వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరారు. రాత్రి 10 గంటలకు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఆయన భేటీ కానున్నారు. పలువురు కేంద్రమంత్రులతోనూ జగన్‌ సమావేశమయ్యే అవకాశముంది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు సహకారం అందించాలని అమిత్‌షాను సీఎం ఇప్పుడూ కోరే అవకాశం ఉందని వైకాపా వర్గాలు చెబుతున్నాయి. 

వచ్చే మూడు నాలుగు నెలల్లో విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానిని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు సీఎం దిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతోపాటు రాష్ట్రంలో దేవాలయాల్లో విగ్రహాలపై జరుగుతున్న దాడులు, పోలీసుల దర్యాప్తులో తేలిన అంశాలు, తదనంతర పరిణామాలూ చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం జగన్‌ వెంట దిల్లీ వెళ్లిన వారిలో ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి (రాజకీయ) ప్రవీణ్‌ ప్రకాశ్‌, అదనపు ఏజీ జాస్తి నాగభూషణ్‌ తదితరులు ఉన్నారు.

ఇవీ చదవండి..

ఉమాపై కొడాలి నాని మరోసారి తీవ్ర విమర్శలు

ప్రజల పక్షాన మాట్లాడితే దాడులా: చంద్రబాబు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని