CM Jagan: మంత్రివర్గ విస్తరణపై సీఎం జగన్‌ కసరత్తు.. నేతల్లో ఉత్కంఠ

మంత్రివర్గ విస్తరణపై ఏపీ సీఎం జగన్‌ కసరత్తు చేస్తున్నారు. సీఎంతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమై కేబినెట్‌ విస్తరణపై దాదాపు 3గంటల పాటు చర్చించారు. కేబినెట్‌లో సామాజిక సమీకరణలతో పాటు సీనియర్ల కొనసాగింపు,...

Published : 09 Apr 2022 01:39 IST

అమరావతి: మంత్రివర్గ విస్తరణపై ఏపీ సీఎం జగన్‌ కసరత్తు చేస్తున్నారు. సీఎంతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమై కేబినెట్‌ విస్తరణపై దాదాపు 3గంటల పాటు చర్చించారు. కేబినెట్‌లో సామాజిక సమీకరణలతో పాటు సీనియర్ల కొనసాగింపు, కొత్తగా ఎవరిని తీసుకోవాలనే దానిపై కసరత్తు జరిగినట్టు తెలుస్తోంది. రాజీనామా చేసిన మంత్రుల పదవీ పునరావాసం కోసం జిల్లా అభివృద్ధి మండళ్ల ఏర్పాటుపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. కేబినెట్‌లో పాతవారిని ఎవరిని కొనసాగించాలనే దానిపై ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం.

మరో వైపు ఈనెల 11న నూతన మంత్రల ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. సచివాలయం వెలుపల ఉన్న అసెంబ్లీ పార్కింగ్‌ స్థలంలో ప్రభుత్వ ప్రొటోకాల్‌ విభాగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రమాణ స్వీకారానికి వచ్చే కొత్త మంత్రుల కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత తేనీటి విందు ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి సూచనతో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు గురువారమే తమ పదవులకు రాజీనామా చేశారు. మంత్రుల నుంచి రాజీనామా లేఖలు తీసుకున్న ముఖ్యమంత్రి.. నిన్న రాత్రి వాటిని గవర్నర్‌ ఆమోదం కోసం పంపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని