CM Jagan: తీరు మార్చుకోకపోతే టికెట్‌ ఇచ్చేది లేదు.. 27మంది ఎమ్మెల్యేలపై జగన్‌ ఆగ్రహం

ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా ఇన్‌ఛార్జిలతో సీఎం జగన్‌ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల

Updated : 28 Sep 2022 18:06 IST

అమరావతి: ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా ఇన్‌ఛార్జిలతో సీఎం జగన్‌ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నివేదికను సీఎం వెల్లడించారు. 27 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని తెలిపారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో వారు సరైన పనితీరు కనబర్చలేదని సీఎం అసంతృప్తి వ్యక్తి చేసినట్టు సమాచారం. 27 మంది ఎమ్మెల్యేలు, మంత్రులపై  ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. పనితీరు మెరుగు పర్చుకోవాలని ఆదేశించారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. పనితీరు మార్చుకోకుంటే టికెట్‌ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. నవంబరులో మరోసారి ఎమ్మెల్యేల పనితీరు సమీక్షిస్తానని, ఎన్నికలకు 6 నెలల ముందే సీటు ఇవ్వని వారి పేర్లు ప్రకటిస్తానని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు