CM Jagan: కుప్పంలో భరత్‌ను గెలిపిస్తే.. మంత్రి పదవి ఇస్తా: సీఎం జగన్‌

కుప్పం నియోజకవర్గం వైకాపా ముఖ్య కార్యకర్తలతో తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్‌

Published : 05 Aug 2022 01:25 IST

అమరావతి: వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తామంటున్న ముఖ్యమంత్రి జగన్‌... తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచే ఆ దిశగా తొలి అడుగు పడాలని వైకాపా నాయకులకు దిశానిర్దేశం చేశారు. కుప్పం నియోజకవర్గ పార్టీ నాయకులతో సమావేశమైన జగన్‌.. వివిధ అంశాలపై వారికి సూచనలు చేశారు. కుప్పం తన సొంత నియోజకవర్గం లాంటిదని, వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి భరత్‌ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. కుప్పం మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకోసం భరత్‌ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు రూ.65 కోట్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. మరో రెండు రోజుల్లో జీవో విడుదలవుతుందని, పనులు కూడా మొదలు పెట్టొచ్చన్నారు. కుప్పానికి సంబంధించి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించనున్నట్టు చెప్పారు. కుప్పం నియోజకవర్గాన్ని కూడా తన సొంత నియోజకవర్గంగా భావిస్తానని చెప్పారు. ఈ మూడేళ్లలో కుప్పం నియోజకవర్గానికి అత్యధికంగా మేలు జరిగిందని,  కుప్పం అభివృద్ధికి అన్ని వేళలా అండగా ఉంటానన్నారు. 175 సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుంచే మొదలు కావాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో భరత్‌తో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని