Polavaram: పెండింగ్‌ బిల్లులు రాబట్టండి: సీఎం

పోలవరం సహా రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఏపీ సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రాధాన్యతను బట్టి

Published : 29 May 2021 01:34 IST

అమరావతి: పోలవరం సహా రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఏపీ సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రాధాన్యతను బట్టి ప్రాజెక్టులు పూర్తి చేయాలని.. ఎక్కడా ఆలస్యం చేయొద్దని అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన జలవనరుల శాఖపై సమీక్షించారు. రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టులు, పల్నాడు ప్రాంత కరవు నివారణ ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులపై సమీక్షించారు. కేంద్రం నుంచి పోలవరం బిల్లుల చెల్లింపుపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు.  దాదాపు రూ.1600కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని.. దిల్లీ వెళ్లి వెంటనే పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ అయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. పోలవరంలో స్పిల్‌వే కాంక్రీటు పనుల్లో 91శాతం అయ్యాయని.. ఈ నెలాఖరు నాటికి స్పిల్‌ ఛానల్‌ పనులు పూర్తవుతాయని వివరించారు.

కాఫర్‌ డ్యామ్‌లో 1, 2 రీచ్‌లు జూన్‌ నెలాఖరునాటికి, 3, 4 రీచ్‌ పనులు జులై నెలాఖరు నాటికి నిర్ణీత ఎత్తుకు పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా అందించాలనే తపనతో ప్రభుత్వం ఉందని చెప్పారు. వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. నెల్లూరు బ్యారేజీ నిర్మాణం జులై 31 నాటికి పూర్తవుతుందని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని