CM Jagan: బీసీలను వెన్నెముక గల కులాలుగా మార్చే బాధ్యత నాది: సీఎం జగన్

వైకాపా మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి వాగ్దానాన్నీ నెరవేరుస్తున్నామని ఏపీ సీఎం జగన్‌ (CM Jagan) అన్నారు.

Published : 07 Dec 2022 13:45 IST

విజయవాడ: వైకాపా మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి వాగ్దానాన్నీ నెరవేరుస్తున్నామని ఏపీ సీఎం జగన్‌ (CM Jagan) అన్నారు. రాజ్యాధికారంలో బీసీలను భాగస్వాములను చేశామని చెప్పారు. విజయవాడ (Vijayawada)లోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వైకాపా (YSRCP) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జయహో బీసీ’ సభలో ఆయన మాట్లాడారు. బీసీలను వెన్నెముక గల కులాలుగా మార్చే బాధ్యత తనదని జగన్‌ చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు మేలు చేస్తున్నామన్నారు.

‘‘బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చాం. రాజకీయ సాధికారతతో పదవులు అందుకుని వారు సేవలందిస్తున్నారు. మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు ఎప్పటికీ ఉంటారు. బీసీ అంటే శ్రమ.. పరిశ్రమ. కుటీర పరిశ్రమల సముదాయం.. గ్రామీణ వృత్తుల సంగమం బీసీలు. దేశ సంస్కృతి, నాగరికతకు ఎంత చరిత్ర ఉందో.. అంత ఘనమైన చరిత్ర వారికీ ఉంది. రాజకీయ అధికారంలో రావాల్సిన వాటా రాకపోవడంతో బీసీలు వెనుకబడ్డారు’’ అని జగన్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని