Vaccines: మోదీకి సీఎం జగన్‌ మరో లేఖ

రాష్ట్రంలో కరోనా నియంత్రణ టీకాల కొరత వేధిస్తున్న వేళ ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి మరో లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా

Published : 23 May 2021 01:36 IST

అమరావతి: రాష్ట్రంలో కరోనా నియంత్రణ టీకాల కొరత వేధిస్తున్న వేళ ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి మరో లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. టీకా కొరతతో ప్రస్తుతం 45ఏళ్లు పైబడిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నామని.. 18 నుంచి 44 ఏళ్ల వయసు వారికి టీకా ప్రక్రియ ప్రారంభించలేకపోయామని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా ధరలు వేర్వేరుగా ఉన్నాయని, ఒక్కో డోసుకు రూ.2వేల నుంచి 25వేలు వసూలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా తప్పుడు సంకేతాలు ఇస్తోందని, ప్రభుత్వ నియంత్రణ లేకుంటే టీకాలను నల్లబజారుకు తరలిస్తారని ఆందోళన వ్యక్తంచేశారు. వ్యాక్సిన్ల కొరత అంటూనే ప్రైవేటుకు ఎలా ఇస్తారని ప్రశ్నించిన సీఎం జగన్‌.. దీనివల్ల సామాన్య ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని ప్రధానికి వివరించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు టీకా కార్యక్రమం జరగాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని