
CM KCR: పంజాబ్ రైతుల పోరాట స్ఫూర్తికి సలాం: తెలంగాణ సీఎం కేసీఆర్
చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం సాగుచట్టాలు రద్దు చేసే వరకు పంజాబ్ రైతులు పోరాడారని.. వారి పోరాట స్ఫూర్తికి సలాం చేస్తున్నానని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. రైతు ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలతో పాటు గాల్వాన్‌లోయలో జరిగిన ఘర్షణల్లో అమరులైన జవాన్ల కుటుంబాలకు దిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌మాన్‌లతో కలిసి కేసీఆర్ ఆర్థిక సాయం చెక్కులు పంపిణీ చేశారు. రైతు ఉద్యమంలో మృతిచెందిన 600 రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆర్థికసాయం అందజేస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించారు. దీనిలో భాగంగానే చండీగఢ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దానికి సంబంధించిన చెక్కులను మృతుల కుటుంబసభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దేశ చరిత్రలో పంజాబ్ రైతులు గొప్ప పోరాటాలు చేశారన్నారు. రాష్ట్రానికి చెందిన భగత్సింగ్లాంటి ఎందరో వీరులు ప్రాణాలర్పించి స్వాతంత్ర్యం సాధించారని చెప్పారు. పంజాబ్ యువకులు సైన్యంలో చేరి దేశాన్ని కాపాడుతున్నారని కొనియాడారు. హరిత విప్లవంతో పంజాబ్ రైతులు దేశం ఆకలిని తీర్చారని.. సాగుచట్టాలు రద్దు చేయించి వ్యవసాయాన్ని కాపాడారన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా దేశం పరిస్థితి మారలేదని.. రైతుల సమస్యలకు ఇంకా పరిష్కారం దొరకడం లేదని చెప్పారు. కేంద్ర సర్కార్ వ్యవసాయంపై ఇప్పటికీ ఆంక్షలు విధిస్తోందని.. సాగుకు ఉచితంగా విద్యుత్ అందిస్తుంటే మీటర్లు పెట్టాలంటోందని విమర్శించారు. భాజపాను ప్రశ్నిస్తుంటే దేశ ద్రోహులనే ముద్ర వేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
AP High court: ఎంపీ రఘురామ కృష్ణరాజు సీఐడీ విచారణకు హైకోర్టు అనుమతి
-
Business News
GST: రాష్ట్రాలకు పరిహారం కొనసాగింపుపై తేలని నిర్ణయం
-
Politics News
Maharashtra: గోవాకు రెబల్ ఎమ్మెల్యేలు.. సుప్రీంలో మొదలైన విచారణ.. ఠాక్రే కేబినెట్ భేటీ
-
Sports News
Junaid Khan : అప్పట్లో టీమ్ఇండియాపై సూపర్ ఓపెనింగ్ స్పెల్.. ట్రోలింగ్‌కు గురైన పాక్ మాజీ పేసర్
-
General News
Telangana News: డిగ్రీ ప్రవేశాల కోసం.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
-
India News
Vice President election: ఉప రాష్ట్రపతి ఎన్నికకు మోగిన నగారా..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Actress Meena: మీనా భర్త మృతి.. పావురాల వ్యర్థాలే కారణమా..?
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్‌పుర్
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- IND vs IRE : అందుకే ఆఖరి ఓవర్‌ను ఉమ్రాన్‌కు ఇచ్చా : హార్దిక్ పాండ్య
- DilRaju: తండ్రైన దిల్‌రాజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
- IND vs IRE : గెలిచారు.. అతి కష్టంగా