Huzurabad By Election: గెల్లు శ్రీనివాస్‌కు బీ ఫారం అందజేసిన సీఎం కేసీఆర్‌

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో తెరాస తరఫున పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ బీ ఫారం అందుకున్నారు. సీఎం కేసీఆర్‌ ఆయనకు బీ ఫారం అందజేశారు. 

Updated : 30 Aug 2022 14:18 IST

హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో తెరాస తరఫున పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ బీ ఫారం అందుకున్నారు. సీఎం కేసీఆర్‌ ఆయనకు బీ ఫారం అందజేశారు. ఎన్నికల ఖర్చు కోసం పార్టీ తరఫున సీఎం కేసీఆర్‌ చెక్కు అందజేశారు. పార్టీ ఫండ్‌గా రూ.28 లక్షల చెక్కును ఇచ్చారు. గెల్లు శ్రీనివాస్‌ బీ ఫారం అందుకునే సమయంలో ఆయన వెంట మంత్రులు హరీశ్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఉన్నారు. 

దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పార్లమెంట్‌, శాసన సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్‌ను విడుదల చేసింది. తెలంగాణలో హుజూరాబాద్‌, ఏపీలో బద్వేల్‌ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అక్టోబర్‌ 30 పోలింగ్‌ నిర్వహించనున్నారు. నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక జరుగుతోంది. ఈటల రాజేందర్‌ భాజపాలో చేరారు. ఈ ఎన్నికను అధికార తెరాస ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గత రెండు నెలలకు పైగానే తెరాస, భాజపా నేతలు అక్కడ మకాం వేసి పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇంతవరకు అక్కడ పోటీ చేయబోయే అభ్యర్థిని ప్రకటించలేదు.    

ముఖ్యమైన తేదీలివే..

ఎన్నికల నోటిఫికేషన్‌: అక్టోబర్‌ 1

నామినేషన్ల స్వీకరణ గడువు: అక్టోబర్‌ 8

నామినేషన్ల పరిశీలన: అక్టోబర్‌ 11

నామినేషన్ల ఉపసంహరణ: అక్టోబర్‌ 13

ఎన్నికల పోలింగ్‌: అక్టోబర్‌ 30

ఓట్ల లెక్కింపు: నవంబర్‌ 2

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని