CM KCR: కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సీఎం కేసీఆర్‌ తీవ్ర అసంతృప్తి

కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు.  

Published : 05 Dec 2021 02:11 IST

హైదరాబాద్‌: మంత్రులు, ఎంపీలతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమావేశం ముగిసింది. ఎనిమిది గంటల పాటు ఈ భేటీ సుదీర్ఘంగా సాగింది. ఈసందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు.  పార్లమెంట్‌లో తెరాస ఎంపీలు ఇన్నాళ్ల పాటు నిరసన తెలుపుతున్నా కేంద్రం సరిగా స్పందించడం లేదని ముఖ్యమంత్రి ఆక్షపించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వలేదన్నారు. శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా ఉభయ సభల్లోనూ సోమవారం కూడా నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెరాస ఎంపీలు అన్నారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని