
Updated : 04 Sep 2021 19:24 IST
KCR-Amit Shah: అమిత్ షాతో సీఎం కేసీఆర్ భేటీ
దిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. శనివారం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఐపీఎస్ క్యాడర్ రివ్యూ, విభజన చట్టం హామీలపై చర్చించే అవకాశం ఉంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంపైనా ఆయన వద్ద ప్రస్తావించనున్నారు.
మరోవైపు, నిన్న సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన కేసీఆర్.. తెలంగాణ అభివృద్ధికి బాసటగా నిలవాలని కోరారు. దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగిన ఈ కీలక భేటీలో పలు అంశాలపై 10 లేఖలను ప్రధానికి అందజేసిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
Tags :