
TS News: రాత్రి 7గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్మీట్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు రాత్రి 7గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. కేంద్ర ప్రభుత్వం నిన్న రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన వ్యవసాయ చట్టాలు సహా పలు అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు, మంత్రులు, తెరాస ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికపై సమావేశంలో చర్చిస్తున్నట్టు సమాచారం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.