TS News: మహా సుదర్శన యాగం ఏర్పాట్లపై జీయర్‌స్వామితో చర్చించిన సీఎం కేసీఆర్‌

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముచ్చింతల్‌లోని జీయర్‌ స్వామి ఆశ్రమానికి ..

Updated : 09 Jan 2022 20:43 IST

హైదరాబాద్‌: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముచ్చింతల్‌లోని జీయర్‌ స్వామి ఆశ్రమానికి విచ్చేశారు. మార్చి 28న మహా కుంభసంప్రోక్షణం చేపట్టాలని, 21 నుంచి మహా సుదర్శనయాగం నిర్వహించాలని ఇప్పటికే ముహూర్తం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు, ఆహ్వానాలు, సంబంధిత అంశాలపై జీయర్‌ స్వామితో సీఎం సమావేశమై చర్చించారు. ఫిబ్రవరిలో జీయర్‌ ఆశ్రమంలో రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ, సంబంధిత ఏర్పాట్లపై కూడా సీఎం చర్చించారు. ఆశ్రమంలో యాగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ఆదేశించారు.

ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్‌.. యాగం సమయంలో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని ఆదేశించారు. మిషన్‌ భగరీథ నీరు అందించాలని అధికారులకు సూచించారు. యాగానికి సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. యాగశాల వద్ద ఫైర్‌ ఇంజన్లు ఏర్పాటు చేయాలని అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు. యగానికి వీఐపీలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వసతి, మెరుగైన సేవలందించేందుకు రోడ్డు సౌకర్యం కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమతామూర్తి విగ్రహాన్ని సీఎం పరిశీలించారు. ఈసందర్భంగా ఆశ్రమ రుత్వికులు సీఎం కేసీఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆశ్రమంలోని యాగశాలకు వెళ్లిన ముఖ్యమంత్రికి ...అక్కడ చేసిన ఏర్పాట్లపై చినజీయర్‌ స్వామి వివరించారు. సీఎంతో పాటు మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌, మైం హోం అధినేత రామేశ్వరరావు ఉన్నారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని