CM KCR: కవితకు ఈడీ నోటీసు.. భయపడే ప్రసక్తే లేదు: సీఎం కేసీఆర్‌

ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఇచ్చిన నోటీసుపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. కవితను అరెస్టు చేస్తామని అంటున్నారని.. చేస్తే చేయనివ్వండి ఏం చేస్తారో చూద్దామని పార్టీ నేతలతో అన్నట్లు సమాచారం.

Updated : 10 Mar 2023 20:06 IST

హైదరాబాద్‌: మద్యం కుంభకోణం వ్యవహారంలో (Delhi Liqour scam) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఇచ్చిన నోటీసులపై సీఎం కేసీఆర్‌ (CM KCR) స్పందించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన  భారత రాష్ట్ర సమితి విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భాజపా ఉద్దేశపూర్వకంగా తమ పార్టీ నేతలను వేధిస్తోందన్న ఆయన... మంత్రులు మల్లారెడ్డి, గంగుల కమలాకర్‌, ఎంపీ రవిచంద్రను ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు  ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చారని  వ్యాఖ్యానించారు.

కేంద్రంలోని భాజపా వేధింపులకు ఆందోళన చెందాల్సిన, బెదరాల్సిన అవసరం లేదన్న సీఎం కేసీఆర్‌.. కమలం పార్టీని గద్దె దింపడమే లక్ష్యంగా మరింత బలంగా పోరాటం చేద్దామని నేతలకు స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసు ఇచ్చారని.. ఏం చేస్తారో చేసుకోనివ్వండని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య, న్యాయబద్ధంగా ఎదుర్కొందామని నేతలకు వివరించారు.  దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత  శనివారం ఉదయం ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ దిల్లీ బయల్దేరి వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని