CM Revanth reddy: సీనియర్‌నేత కేకే నిర్ణయం కాంగ్రెస్‌ పార్టీకి మంచిదే: రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.కేశవరావు సేవలను పార్టీ వినియోగించుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

Published : 04 Jul 2024 20:49 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.కేశవరావు సేవలను పార్టీ వినియోగించుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా చేయడంపై సీఎం స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఏది మంచిదో అదే నిర్ణయం కేకే తీసుకున్నారన్నారు.

నైతిక విలువలతో రాజీనామా చేశా: కేకే

తాను కాంగ్రెస్‌ మనిషినని, కాంగ్రెస్‌ తన సొంత ఇల్లు అని ఈ సందర్భంగా కేకే వ్యాఖ్యానించారు. ఆ పార్టీ ఎంపీలతోనే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణలో ప్రస్తుతం పాలన ప్రజాస్వామ్య బద్ధంగా ఉందన్నారు. ఆరు నెలల్లో ఎవరినీ అంచనా వేయలేమన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న వారు ఫ్యామిలీ పబ్లిసిటీ చేశారని విమర్శించారు. భారాస రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందునే నైతిక విలువలతో రాజీనామా చేసినట్టు చెప్పారు. రాజ్యసభ ఛైర్మన్‌కు కూడా ఇదే విషయం చెప్పానని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని