CM Revanth Reddy: చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం: రేవంత్‌రెడ్డి

బసవతారకం ఆసుపత్రి లక్షలాది మందికి సేవలందిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆసుపత్రి వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Updated : 22 Jun 2024 17:02 IST

హైదరాబాద్‌: బసవతారకం ఆసుపత్రి లక్షలాది మందికి సేవలందిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆసుపత్రి వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిస్వార్థంగా పేదలకు సేవలందించేందుకు ఆసుపత్రిని నిర్మించారని చెప్పారు. ‘‘ఏపీ సీఎం చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం నాకు వచ్చింది. ఆయన 18 గంటలు పనిచేసి.. నేను 12 గంటలు పని చేస్తే సరిపోదు. తెలంగాణ రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పని చేయాల్సిందే. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీ పడాలి.. ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి. హెల్త్‌ టూరిజం హబ్‌ ఏర్పాటు చేయాలని చూస్తున్నాం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

ఆసుపత్రి సేవలను మరింత విస్తరించాలి: నందమూరి బాలకృష్ణ

క్యాన్సర్‌ మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తోందని బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్‌, మేనేజింగ్‌ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆసుపత్రి సేవల విస్తరణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి సహకారం కోరగానే అంగీకరించారని చెప్పారు. దాతల సహకారంతో ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకుందని తెలిపారు. సేవలను మరింత విస్తరించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, డా.నోరి దత్తాత్రేయుడు పాల్గొన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని