CM Revanth Reddy: రేపు విజయవాడకు సీఎం రేవంత్‌రెడ్డి

ఏపీ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం (ఈ నెల 8న) విజయవాడలో నిర్వహించనున్న దివంగత సీఎం వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి జయంతి సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు.

Published : 07 Jul 2024 04:11 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం (ఈ నెల 8న) విజయవాడలో నిర్వహించనున్న దివంగత సీఎం వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి జయంతి సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ఆయన వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు వెళ్లనున్నారు. ఈ సభకు హాజరుకావాలని రేవంత్‌రెడ్డిని ఇటీవల ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆహ్వానించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని