venkaiah naidu: తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి

తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ కావడం ఒక మంచి ముందడుగు అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు.

Published : 08 Jul 2024 03:57 IST

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ కావడం ఒక మంచి ముందడుగు అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి ఉభయ రాష్ట్రాల మధ్య అపరిష్కృత అంశాలపై వీలైనంత త్వరలో అంగీకారానికి వస్తారని ఆశిస్తున్నానని ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని