Published : 16 Jun 2021 13:46 IST

TS News: ఈట‌ల‌, తెరాస వర్గీయుల‌ వాగ్వాదం

ఇల్లంద‌కుంట‌: హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని ఇల్లందకుంట‌లో క‌ల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ర‌సాభాస చోటు చేసుకుంది. తెరాస ప్ర‌జా ప్ర‌తినిధులు రెండు వ‌ర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగారు. మాజీ మంత్రి, భాజ‌పా నేత ఈట‌ల‌కు కొంద‌రు.. అధికార తెరాస‌కు కొంద‌రు మ‌ద్ద‌తు తెలిపారు. జ‌డ్పీ ఛైర్‌ప‌ర్స‌న్ విజ‌య అధ్య‌క్ష‌త వ‌హించిన చెక్కుల పంపిణీ కార్య‌క్రమంలో చొప్ప‌దండి ఎమ్మెల్యే సుంకే ర‌విశంక‌ర్, ఆర్డీవో పాల్గొన్నారు. 

ఈ కార్య‌క్ర‌మానికి జ‌డ్పీ ఛైర్ ప‌ర్స‌న్ ఎలా అధ్య‌క్ష‌త వ‌హిస్తార‌ని ఈట‌ల మ‌ద్ద‌తుదారు ఇల్లంద‌కుంట‌ ఎంపీపీ పావ‌ని వ‌ర్గీయులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. దీంతో రెండు వ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులు వీరికి న‌చ్చజెప్పారు. మ‌రోవైపు త‌మ‌కు రాజకీయాలు వ‌ద్దు చెక్కులు కావాలంటూ ల‌బ్ధిదారులు నినాదాలు చేశారు. అనంత‌రం ఆర్డీవో క‌ల‌గజేసుకొని 189 మందికి కల్యాణ ల‌క్ష్మి, షాదీ ముబార‌క్‌ చెక్కులు పంపిణీ చేశారు. 

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని