Mayawati: అదో ఎన్నికల డ్రామానే.. కాంగ్రెస్‌ చెప్పేదొకటి.. చేసేది ఇంకొకటి!

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  40 శాతం టికెట్లను మహిళలకు రిజర్వ్‌ చేస్తామని కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించడంపై బీఎస్పీ అధినేత్రి,.......

Published : 20 Oct 2021 01:01 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  40 శాతం టికెట్లను మహిళలకు రిజర్వ్‌ చేస్తామని కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించడంపై బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి స్పందించారు. అదంతా కేవలం ఎన్నికల డ్రామా మాత్రమేనని విమర్శించారు. అధికారంలో లేనప్పుడే కాంగ్రెస్‌ పార్టీకి మహిళలు, దళితులు, వెనుకబడినవారు గుర్తొస్తారంటూ ట్విటర్‌లో చురకలంటించారు. మహిళల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేసే సంకల్పం కాంగ్రెస్‌కు లేదన్నారు. గతంలో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్‌, అసెంబ్లీల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లపై చట్టం తీసుకురావాల్సిందన్నారు.

కాంగ్రెస్‌కు అధికారం ఉన్నప్పుడు దళితులు, వెనుకబడిన వర్గాలు, మహిళలు గుర్తుండరని.. మహిళలకు 40శాతం రిజర్వేషన్లు కల్పించడం మాత్రం కేవలం ఎన్నికల డ్రామా తప్ప ఇంకొకటి కాదన్నారు. మహిళల సంక్షేమం పట్ల అంత శ్రద్ధ ఉంటే చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలుచేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ చెప్పేదొకటి.. చేసేది ఇంకొకటి అని ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని