Congress: కాంగ్రెస్‌ కీలక నిర్ణయం.. పార్టీ పదవుల్లో 50 వారికే..!

వరుస పరాజయాలతో సతమతమవుతోన్న కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగతంగా బలోపేతమయ్యే దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే పార్టీలోని అన్ని పదవుల్లో

Published : 14 May 2022 18:31 IST

దిల్లీ: వరుస పరాజయాలతో సతమతమవుతోన్న కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగతంగా బలోపేతమయ్యే దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే పార్టీలోని అన్ని పదవుల్లో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనార్టీలకు ప్రాతినిధ్యాన్ని 50శాతానికి పెంచాలని భావిస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు పార్టీ నేతలు శనివారం వెల్లడించారు.

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పార్టీ నవ సంకల్ప చింతన్‌ శిబిర్‌ జరుగుతోన్న విషయం తెలిసిందే. రెండో రోజైన శనివారం.. సామాజిక న్యాయం, సాధికారితపై పార్టీ నేతలు చర్చించారు. అందుకు సంబంధించిన వివరాలను పార్టీ నేత కె. రాజు మీడియాకు వివరించారు. పార్టీలో సామాజిక న్యాయం సాధించే దిశగా సంస్థాగత సంస్కరణలను తీసుకురావాలని హైకమాండ్‌ భావిస్తున్నట్లు తెలిపారు. పార్టీలోని అన్ని స్థాయుల్లో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనార్టీల ప్రాతినిధ్యాన్ని 50 శాతానికి పెంచాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం సోషల్‌ జస్టిస్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనలను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఆమోదిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

శుక్రవారం ప్రారంభమైన చింతన్‌ శిబిర్‌లో అధినేత్రి సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం చేశారు.  దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ గతంలో మాదిరిగా క్రియాశీల పాత్ర పోషించాలని ప్రజలు కోరుకుంటున్నారని, వారి ఆశలను నెరవేర్చేలా క్షేత్ర స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేద్దామని నేతలకు ఆమె సూచించారు. ఇప్పటివరకూ కాంగ్రెస్‌ పార్టీ... నేతలకు ఎంతో చేసిందని, ఇప్పుడు దాని రుణం తీర్చుకొనే సమయం వచ్చిందని ఉద్బోధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని