Published : 15/03/2021 18:27 IST

కాంగ్రెస్‌ జిన్నా మార్గంలో నడుస్తోంది: భాజపా

గువహటి: అసోంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్‌, భాజపాలు ప్రచార వేగాన్ని పెంచాయి. తాజాగా అసోంలో ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రమైన విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మహాత్మాగాంధీ మార్గంలో కాకుండా... జిన్నా మార్గాన్ని అనుసరిస్తోందని విమర్శించారు. ఈ మేరకు ఆయన సోమవారం అసోంలోని దిబ్రుగఢ్‌ జిల్లా నహర్కతియాలో నిర్వహించిన ఎన్నికల సభలో మాట్లాడారు.

‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలమైంది. కాంగ్రెస్‌ పార్టీ మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడవడం లేదు. ఆ పార్టీ, వారి నాయకుడు రాహుల్‌గాంధీ.. జిన్నా మార్గాన్ని అనుసరిస్తున్నారు. జిన్నా విధానాలు అసోంను భారతదేశాన్ని నాశనం చేస్తాయి. రాహుల్‌గాంధీ అసోంలో విభజన రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. గిరిజనులు, ఇతర కులాల మధ్య విభజన రాజేయాలని చూస్తున్నారు. అసోంను వారి పార్టీ 55 ఏళ్ల పాటు పరిపాలించింది. కానీ, రాష్ట్రానికి చేసిందేమీ లేదు. నిరుద్యోగం, అక్రమ వలసలు, హింస, ఉగ్రవాదం పలు సమస్యలు అలాగే ఉండిపోయాయి’ అని చౌహాన్‌ ఆరోపించారు.

కాంగ్రెస్‌ వల్లే అవినీతి:నడ్డా

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత కాలంలో అవినీతి పెరిగిపోయిందని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలు మళ్లీ రాష్ట్రానికి వచ్చి హామీల వర్షం కురిపిస్తున్నారని నడ్డా మండిపడ్డారు.  ఈ మేరకు ఆయన డాకూఖానాలో నిర్వహించిన సభలో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఇటీవల అసోంకు వచ్చినప్పుడు ఐదు హామీల ప్రచారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సీఏఏను ఉచిత కరెంటు, మహిళలకు నగదు ఆసరా, టీ కార్మికులకు కూలీ పెంపు సహా పలు హామీలు చేశారు. 

‘అసోంలో కాంగ్రెస్‌ పార్టీ దాదాపు 50 ఏళ్లకు పైగా పాలించింది. ఆ కాలంలో ఆ పార్టీ కారణంగా రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది. ఆ తర్వాత భాజపా అధికారంలోకి వచ్చాక ఈ ఐదేళ్ల కాలంలో మేం ఇక్కడ ఉన్న పలు సమస్యలను పరిష్కరించాం. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం సర్బనంద సోనోవాల్‌ నేతృత్వంలో అసోం అభివృద్ధి పథంలో నడుస్తోంది. రాబోయే ఎన్నికల్లోనూ భాజపా అభ్యర్థులనే ఎన్నుకోవడం ద్వారా రాష్ట్రంలో పెండింగ్‌లలో ఉన్న పనులన్నీ వచ్చే ఐదేళ్లలో పూర్తవడానికి అవకాశం ఉంటుంది’ అని నడ్డా వెల్లడించారు. అసోంలో మార్చి 27న తొలిదశ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని