KTR: నా పర్యటనలు తక్కువ అయ్యాయని తిట్టుకోవద్దు: మంత్రి కేటీఆర్‌

సిరిసిల్ల జిల్లాలో ఒక్క రోజులోనే 4 గ్రామాల్లో 378 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించి పంపిణీ చేసినట్లు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

Updated : 27 Sep 2023 19:27 IST

గంభీరావుపేట: సిరిసిల్ల జిల్లాలో ఒక్క రోజులోనే 4 గ్రామాల్లో 378 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించి పంపిణీ చేసినట్లు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. గంభీరావుపేటలోని ఎస్సీ కాలనీలో 104, బీసీ కాలనీలో 168 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘‘జిల్లాలో ఈ మధ్య నా పర్యటనలు తక్కువ అయ్యాయని ఎవరూ తిట్టుకోవద్దు. రైతులను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో గొప్పగొప్ప ఆలోచనలు చేశారు. జనాన్ని గందరగోళానికి గురిచేయడమే కాంగ్రెస్ పార్టీ పని. వారంటీ లేని ఆ పార్టీ గ్యారంటీలు ఇస్తే ప్రజలు నమ్ముతారా? ఎన్నికల్లో  గెలిచేందుకు నేను మందు పోయను.. పైసలు ఇవ్వను. ఇలా  చెప్పే దమ్ము, ధైర్యం ఆ పార్టీలో ఎవరికైనా ఉందా? కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల నుంచి డబ్బులు తెచ్చి ఎన్నికల్లో  గెలవాలని చూస్తోంది. ఆ డబ్బులు తీసుకొని కారు గుర్తుకు ఓటు వేయండి. ముచ్చటగా మూడోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించాలి’’ అని మంత్రి కేటీఆర్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని