ఆడిన మాట తప్పం : రాహుల్‌

తమ పార్టీ భాజపాలా కాదని, అధికారంలోకి వస్తే ఎన్నికల హామీలన్నీ నేరవేర్చి మాట నిలబెట్టుకుంటుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బుధవారం చైగావ్, బర్ఖేత్రి నియోజకవర్గాల్లో.....

Updated : 01 Apr 2021 13:13 IST

గువాహటి: తమ పార్టీ భాజపాలా కాదని, అధికారంలోకి వస్తే ఎన్నికల హామీలన్నీ నేరవేర్చి మాట నిలబెట్టుకుంటుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బుధవారం చైగావ్, బర్ఖేత్రి నియోజకవర్గాల్లో రాహుల్‌ పర్యటించారు. ఇక్కడి నీలాంచల్‌లోని కామాఖ్యదేవి అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో రాహుల్‌ మాట్లాడారు. 

ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటనూ నేరవేర్చి కాంగ్రెస్‌ రికార్డును తిరిగి నెలకొల్పుతామని చెప్పారు. పంజాబ్‌, ఛత్తీస్‌గడ్, కర్ణాటక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే పంట రుణాలను మాఫీ చేశామన్నారు. అలాగే అస్సాంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సీఏఏ రద్దుతో సహా ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాల కల్పన, ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, గృహిణిలకు నెల రూ.2000, టీ కార్మికుల రోజువారి కనీస భృతిని రూ.365 పెంచుతామని రాహుల్‌ మాటిచ్చారు. గురువారం సిల్చర్‌, హఫ్‌లాంగ్, బోకాజన్ నియోజకవర్గాల్లో రాహుల్‌ పర్యటించనుండగా, భారీ వర్షాల కారణంగా ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు. అస్సాంలోని 39 స్థానాలకు రేపు రెండో విడత పోలింగ్‌ జరగనుంది.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని