గృహిణులకు నెలనెలా ₹2వేలు: ప్రియాంక హామీల వర్షం 

అసోంలో ఎన్నికల వేళ కాంగ్రెస్‌ హమీల వర్షం కురిపిస్తోంది. మంగళవారం అసోంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ......

Updated : 02 Mar 2021 17:51 IST

అసోంలో కాంగ్రెస్‌ హామీల వెల్లువ

గువాహటి: అసోంలో ఎన్నికల వేళ కాంగ్రెస్‌ హమీల వర్షం కురిపిస్తోంది. మంగళవారం అసోంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా పర్యటించారు. ఈ సందర్భంగా తేజ్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు వేసి గెలిపిస్తే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని నిలిపివేస్తామన్నారు. అలాగే, ప్రతి ఇంటికి 200 యూనిట్ల చొప్పున విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. తేయాకు మహిళా కార్మికులకు దినసరి వేతనం రూ.365 చేస్తామన్నారు. అలాగే, గృహిణి సమ్మాన్‌ పేరుతో ప్రతి గృహిణికి నెలనెలా రూ.2వేలు చొప్పున నగదు పంపిణీచేస్తామని మాటిచ్చారు. అసోంలో 5లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. రెండో రోజు అసోంలో పర్యటిస్తున్న సందర్భంగా తేజ్‌పూర్‌లో ప్రచారానికి ముందు బిశ్వనాథ్‌ ప్రాంతంలో సాధురు టీ ఎస్టేట్‌కు వెళ్లి అక్కడ కూలీలతో మాట్లాడారు. తేయాకు తెంపుతూ సందడి చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉన్న అసోంలో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మార్చి 27, ఏప్రిల్‌ 1, ఏప్రిల్‌ 6 తేదీల్లో పోలింగ్‌ జరగనుండగా.. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు