Anurag thakur: కర్ణాటకను ATMలా వాడుకున్నారు.. అనురాగ్‌ ఠాకూర్‌ ఆరోపణ

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌(anurag thakur) విపక్షాలపై మండిపడ్డారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌.. ఈ రెండు పార్టీలూ రాష్ట్రాన్ని ఏటీఎంలా వినియోగించుకున్నాయని ఆరోపించారు.

Published : 13 Mar 2023 01:26 IST

బెంగళూరు:  కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీలు కర్ణాటక(Karnataka)ను తమ నేతలకు డబ్బులిచ్చే ఏటీఎం(ATM)లా ఉపయోగించుకున్నాయని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌(Anurag thakur) ఆరోపించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కోలార్‌లో ఆయన ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ ( HAL) మూసివేత గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ హయాంలో కర్ణాటకను రాహుల్‌గాంధీ, సోనియా గాంధీ ఏటీఎంలా మార్చేశారనీ.. ఇక్కడినుంచి డబ్బు తరలిపోయిందన్నారు. జేడీఎస్‌ సారథ్యంలోని ప్రభుత్వం అయితే ఆ ఒక్క కుటుంబానికే రాష్ట్రాన్ని ఏటీఎంలా మార్చుకుందని దుయ్యబట్టారు. విదేశీ గడ్డపై రాహుల్‌ గాంధీ భారత్‌ గురించి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.  డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం కారణంగానే కర్ణాటక అభివృద్ధికి నిధులు వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో కర్ణాటకలో రహదారుల నిర్మాణం కోసం కేవలం రూ.6వేల కోట్లు ఖర్చే చేస్తే.. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలోనే  రూ.50వేల కోట్లు ఖర్చుపెట్టిందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు