ఎడ్లబండి పైనుంచి పడిన రాజనర్సింహ

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై మెదక్‌లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన నిరసన ప్రదర్శనలో అపశ్రుతి చోటుచేసుకుంది.

Published : 12 Jul 2021 14:21 IST

మెదక్‌: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై మెదక్‌లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన నిరసన ప్రదర్శనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఎడ్ల బండి పైనుంచి జారి కిందపడ్డారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఎద్దులు బెదరడంతో అదుపుతప్పి కింద పడిపోయారు. ఈ ఘటనలో రాజనర్సింహ మోకాలికి స్వల్ప గాయమైంది. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts