Dasoju Sravan: భయంకరమైన డ్రగ్స్‌ డెన్లుగా హైదరాబాద్‌ పబ్‌లు: దాసోజు శ్రవణ్‌

ఆధునికత పేరుతో నగరంలోని పబ్‌లు భయంకరమైన డ్రగ్‌ డెన్స్‌గా మారుతున్నాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు

Updated : 05 Jun 2022 12:31 IST

హైదరాబాద్‌: ఆధునికత పేరుతో నగరంలోని పబ్‌లు భయంకరమైన డ్రగ్‌ డెన్స్‌గా మారుతున్నాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ విమర్శించారు. అసభ్యత, వికృత సంస్కృతిని పెంచి యువకుల కెరీర్‌ను నాశనం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు శ్రవణ్‌ ట్వీట్‌ చేశారు. మన యువత భవిష్యత్తు, సంస్కృతిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పబ్‌లు, హుక్కా సెంటర్లు, బెల్ట్‌ షాపులను తప్పనిసరిగా నిషేధించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఇటీవల జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌కు వెళ్లిన మైనర్‌ బాలికను కొంతమంది యువకులు కారులో బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ విషయం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటూ దాసోజు శ్రవణ్‌ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని