Congress: కరోనా కట్టడికి కృషి చేయకుండా ప్రసంగాలనునమ్ముకుంటున్నారు: మల్లికార్జున్‌ ఖర్గే

దేశంలో కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్యను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తక్కువ చేసి చూపుతున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ మల్లికార్జున్‌ ఖర్గే ఆరోపించారు. శనివారం రాత్రి ప్రధాని మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంపై ఆయన తాజాగా స్పందించారు. ‘‘ ప్రధాని మోదీ.. కరోనా మరణాలపై

Published : 27 Dec 2021 01:10 IST

ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ నేత విమర్శలు

దిల్లీ: దేశంలో కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్యను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తక్కువ చేసి చూపుతున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ మల్లికార్జున్‌ ఖర్గే ఆరోపించారు. శనివారం రాత్రి ప్రధాని మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంపై ఆయన తాజాగా స్పందించారు. ‘‘ ప్రధాని మోదీ.. కరోనా మరణాలపై తప్పుడు లెక్కలు చెబుతున్నారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టకుండా కేవలం ప్రసంగాలని నమ్ముకున్నారు. దేశ ప్రధానమంత్రి పదవిలో ఉండి నరేంద్ర మోదీ భాజపాకి చేసినంత ప్రచారం గతంలో ఎవరూ ఆ పార్టీకి చేసి ఉండరు’’అని వ్యాఖ్యానించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాని గెలిపిస్తే.. రాజ్యాంగం మొత్తాన్ని సవరణ చేస్తారని, ఇది సామాన్య ప్రజల భావప్రకటన హక్కుపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార కోసం ప్రతి రోజు అందుబాటులో ఉండే ప్రధాని మోదీ.. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సమావేశాలకు మాత్రం డుమ్మా కొట్టారని ఎంపీ ఖర్గే విమర్శించారు.

Read latest Political News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని