Telugu News: కేసీఆర్‌.. రైతుబంధుతో ఎవరు లబ్ధి పొందుతున్నారో తెలుసా?: పొన్నాల

దళితబంధు పథకం అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. 2022-23 బడ్జెట్‌లో అసెంబ్లీ నియోజకవర్గానికి 100 కుటుంబాలకు చొప్పున దళితబంధు...

Published : 08 Mar 2022 01:12 IST

హైదరాబాద్‌: దళితబంధు పథకం అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. 2022-23 బడ్జెట్‌లో అసెంబ్లీ నియోజకవర్గానికి 100 కుటుంబాలకు చొప్పున దళితబంధు ఇస్తామని చెప్పిన సీఎం.. కేవలం రూ.17వేల కోట్లు కేటాయించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇలా రాష్ట్రంలోని 17లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకం అమలు కావాలంటే 136 సంవత్సరాలు పడుతుందన్నారు. ప్రాధాన్యత కలిగిన విభాగాలకు సరైన కేటాయింపులు చేయలేదని పేర్కొన్నారు. ఒక్కో డబుల్‌ బెడ్‌ రూమ్‌ నిర్మాణానికి రూ.6.50 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్న సీఎం.. ఇప్పుడు జాగా ఉన్న వారు రూ.3 లక్షలతో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు కట్టుకోగలరా అని ప్రశ్నించారు.

‘‘తెరాస ప్రభుత్వం వల్ల రాష్ట్రాభివృద్ధి ఏమాత్రం జరగలేదు. నాడు కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదుల మీదే ఇవాళ అభివృద్ధి జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పస లేదు. పెట్టుబడికి అధికంగా కేటాయించి, ఖర్చు చేసినప్పుడే భవిష్యత్తులో అది రాష్ట్రానికి పునాది అవుతుంది. ప్రాజెక్టులు నిర్మించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశామంటున్న కేసీఆర్‌.. వరి ఎందుకు వేయొద్దంటున్నారో చెప్పాలి. ఈ బడ్జెట్‌లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఎలాంటి ప్రస్తావన లేదు. రైతు బంధు అంటూ ఉదరగొడుతున్న కేసీఆర్‌.. అది ఎవరికి లబ్ధి చేకూరుస్తుందో తెలుసా? ఈ పథకం వల్ల రాష్ట్రంలోని 14 లక్షల మంది కౌలు రైతులకు ఏలాంటి లాభం ఉండటం లేదు’’ అని పొన్నాల పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు