బండి సంజయ్‌ వ్యాఖ్యలను ఖండించిన షబ్బీర్‌ అలీ

గ్రేటర్‌లో భాజపా గెలుస్తే పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ ఖండించింది. శత్రుస్థావరాలపై నిర్వహించాల్సిన సర్జికల్‌ స్ట్రైక్‌ సొంత దేశంలో నిర్వహిస్తాననడం సరికాదని ఆ పార్టీ

Updated : 12 Oct 2022 15:31 IST

హైదరాబాద్‌: గ్రేటర్‌లో భాజపా గెలుస్తే పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ ఖండించింది. శత్రుస్థావరాలపై నిర్వహించాల్సిన సర్జికల్‌ స్ట్రైక్‌ సొంత దేశంలో నిర్వహిస్తాననడం సరికాదని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ విమర్శించారు. ఎంపీగా బాధ్యతాయుత పదవిలో ఉన్న బండి సంజయ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై ఎన్నికల కమిషన్‌ కానీ, పోలీసులు కానీ చర్య తీసుకోవాలిన షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని