Munugode ByPoll: మునుగోడు ఉప ఎన్నిక.. నమ్మకానికి, అమ్మకానికి మధ్య జరుగుతున్న యుద్ధం: కాంగ్రెస్‌

ఈనెల 11న మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఉప ఎన్నిక వ్యూహంపై గాంధీభవన్‌లో దాదాపు 3గంటలకు పైగా కాంగ్రెస్‌ ముఖ్య నేతలు సమావేశమై చర్చించారు. నమ్మకానికి, అమ్మకానికి మధ్య జరుగుతున్న యుద్ధమంటూ ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించారు.

Published : 05 Oct 2022 01:58 IST

హైదరాబాద్‌:  ఈనెల 11న మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మునుగోడు ఉప ఎన్నిక వ్యూహంపై గాంధీభవన్‌లో దాదాపు 3గంటలకు పైగా కాంగ్రెస్‌ ముఖ్య నేతలు సమావేశమై చర్చించారు. రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. ఉప ఎన్నిక ప్రచారం, తెరాస, భాజపాలను ఎలా ఎదుర్కోవాలి తదితర విషయాలపై నేతలు చర్చించారు. మహిళా అభ్యర్థికి అవకాశమిచ్చామన్న విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి స్రవంతి ఈనెల 11న రెండు సెట్లు, 14న భారీ జనసమీకరణతో మరో సారి నామినేషన్‌ వేయాలని నిర్ణయించారు.

ఈనెల 9 నుంచి 14 వరకు రేవంత్‌రెడ్డితో పాటు సీనియర్‌ నేతలంతా మునుగోడులోనే మకాం వేయనున్నారు. ఉప ఎన్నిక నమ్మకానికి, అమ్మకానికి మధ్య జరుగుతున్న యుద్ధమంటూ ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం పాల్వాయి స్రవంతి మీడియాతో మాట్లాడుతూ... మునుగోడు ఉప ఎన్నికకు నాయకులు అందరూ సహకరిస్తామని చెప్పారని తెలిపారు. త్వరలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటారని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ చేసిన అభివృద్ధే తమను విజయపథంలో నడిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని