Jagga Reddy: చేదు అనుభవాలు ఎదురవుతున్నాయ్.. అందుకే బాయ్‌కాట్: జగ్గారెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం నుంచి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అర్ధంతరంగా బయటకు వెళ్లిపోయారు. గతంలోనూ తనకు చాలా అవమానాలు జరిగాయని.. ఇప్పుడూ జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సీఎల్పీ సమావేశాన్ని తాను బహిష్కరించినట్లు చెప్పారు.
ఏం జరిగిందంటే..
రేపటి నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో తాజ్ డెక్కన్ హోటల్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో పాటు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ భేటీకి ముందు ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ సమావేశంలో పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడొద్దని భట్టి విక్రమార్క తదితరులు సూచించడంతో జగ్గారెడ్డి తన ప్రెస్‌మీట్‌ను విరమించుకుని సీఎల్పీ సమావేశానికి వెళ్లారు. అక్కడ కాసేపు నిరీక్షించిన అనంతరం అర్ధంతరంగా బయటకు వచ్చేశారు.
అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేశారు. మెదక్ జిల్లా పర్యటనకు రేవంత్ వెళ్లారని.. ఆ విషయం తనకు తెలియలేదన్నారు. ఆయన ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు. గతంలోనూ పలుమార్లు ఇలా జరిగిందన్నారు. తాజాగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సీఎల్పీ సమావేశంలో ప్రస్తావించాలని అనుకున్నానని.. అయితే ఆ అంశాలను మాట్లాడొద్దని భట్టి విక్రమార్క, కుసుమకుమార్ సూచించారన్నారు. అందుకే సీఎల్పీ సమావేశాన్ని బాయ్‌కాట్ చేసి వెళ్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
CWG 2022: కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్నఇద్దరు బాక్సర్లు అదృశ్యం.. ఉపాధి కోసమేనా?
-
Crime News
Crime news: యమునా నదిలో 35మందితో పడవ బోల్తా.. నలుగురి మృతి.. ముమ్మర గాలింపు
-
Technology News
Xiaomi MiGU Headband: షావోమి హెడ్‌బ్యాండ్.. మనిషి మెదడును చదివేస్తుంది!
-
Politics News
Revanth reddy: మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్‌కు చాలా కీలకం: రేవంత్‌రెడ్డి
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట: ఈవో
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
- Lal Singh Chaddha: రివ్యూ: లాల్ సింగ్ చడ్డా
- Vishal: షూటింగ్లో ప్రమాదం.. నటుడు విశాల్‌కు తీవ్ర గాయాలు
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- IT Raids: వ్యాపారి ఇళ్లల్లో నోట్ల గుట్టలు.. లెక్కించడానికే 13 గంటలు!
- Hanumakonda: రైలెక్కించి పంపారు.. కాగితాల్లో చంపారు
- YS Vijayamma: వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?