Jagga Reddy: రేవంత్‌తో కలిసి పనిచేసేందుకు ఇబ్బందేం లేదు.. కానీ..: జగ్గారెడ్డి

కాంగ్రెస్‌లోని కొందరు సోషల్‌ మీడియాలో తన పరువు తీస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి (జగ్గారెడ్డి) ఆరోపించారు.

Updated : 22 Mar 2022 16:35 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌లోని కొందరు సోషల్‌ మీడియాలో తన పరువు తీస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి (జగ్గారెడ్డి) ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేసేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నియమించిన ఏ వ్యక్తితోనైనా కలిసి పనిచేస్తానని చెప్పారు. ఇటీవల కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల సమావేశాలు, రేవంత్‌తో విభేదాలు, పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సీఎల్పీ కార్యాలయంలో జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

‘‘నిర్మొహమాటంగా నిజాలు మాట్లాడటం నా స్వభావం. ఇది కాంగ్రెస్‌ పంచాయితీ కాదు.. రేవంత్‌రెడ్డితోనే నా పంచాయితీ. మా ఇద్దరి గుణగణాల పంచాయితీ. రేవంత్‌రెడ్డి మెదక్‌ పర్యటనకు వెళ్తే నన్ను ఆహ్వానించలేదు. ఆ పర్యటనకు నన్ను పిలవకపోవడంతో నాకు కోపం వచ్చింది. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి పార్టీలో విలువ ఉండదా? పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ను కలుపుకొనిపోయే పద్ధతి లేదా?ఏ ఆలోచన లేని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీతోనే ఎవరికైనా మేలు జరుగుతుంది. సోనియాగాంధీ కుటుంబం వల్లే పార్టీ గొప్ప స్థాయికి చేరింది. కాంగ్రెస్‌పై అభిమానంతో ఎప్పటినుంచో ఈ పార్టీలో కొనసాగుతున్నా. నాకు, సీఎం కేసీఆర్‌కు రాజకీయంగా ఎలాంటి వివాదాలు లేవు’’ అని జగ్గారెడ్డి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని