రాజకీయ ప్రయోజనాల కోసమే జలవివాదం: జగ్గారెడ్డి

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌ కలిసి జలవివాదం పేరుతో ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు...

Published : 10 Jul 2021 15:19 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌ కలిసి జలవివాదం పేరుతో ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. ఇద్దరు సీఎంలు కలిసి సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోకుండా వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు సైతం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. ఇలా మాట్లాడటం వల్ల సమస్యలకు పరిష్కారం లభించదన్నారు. ముఖ్యమంత్రులిద్దరూ కలిసి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే జలవివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ప్రజలు కరోనా కష్టాలు పడుతుంటే దాన్ని పక్కదారి పట్టించేందుకు జలవివాదాన్ని వాడుకుంటున్నారని పేర్కొన్నారు.

‘‘సీఎం జగన్ సోదరి షర్మిల.. తెలంగాణలో పార్టీ అంటూ కొత్త డ్రామాకు తేర లేపారు. షర్మిల తెలంగాణ కోడలే అయినా ఆమెది రాయలసీమ రక్తమే కదా. అక్కడ అన్న.. ఇక్కడ చెల్లెలు ప్రజలను మభ్యపెడుతున్నారు. షర్మిల పార్టీ పెట్టడం వెనుక భాజపా ప్రమేయం ఉంది. ఇప్పటివరకు జగన్ ఏ విషయంలోనూ భాజపాపై విమర్శలు చేయలేదు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ విషయంలో కార్మికులు రోడ్ల పైకి వచ్చినా జగన్ నోరు మెదపడం లేదు’’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని