Modi: ‘దేశాన్ని విభజించాలి.. కలిసికట్టుగా దోచుకోవాలి’ కాంగ్రెస్‌ సిద్ధాంతమిదే: మోదీ

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగున్న వేళ భాజపా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చురుగ్గా పాల్గొంటున్నారు. ఉత్తరాఖండ్‌లో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ అల్మోరాలో నిర్వహించిన ‘విజయ సంకల్ప సభ’లో ఆయన

Published : 11 Feb 2022 18:18 IST

అల్మోరా: దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో భాజపా ప్రచార కార్యక్రమాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చురుగ్గా పాల్గొంటున్నారు. ఉత్తరాఖండ్‌లో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ అల్మోరాలో నిర్వహించిన ‘విజయ సంకల్ప సభ’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. హస్తం పార్టీ దేశాన్ని విభజించి దోచుకోవాలని చూస్తోందన్నారు.

‘‘భాజపా ప్రభుత్వం ‘సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌’ అనే సిద్ధాంతంతో పాలన సాగిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ దీనికి వ్యతిరేకంగా ‘దేశాన్ని విభజించాలి.. కలిసికట్టుగా దోచుకోవాలి’ అనే సిద్ధాంతాన్ని పాటిస్తోంది’’అని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. గత ప్రభుత్వాల హయాంలో ఉత్తరాఖండ్‌లోని సరిహద్దు ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, భాజపా సర్కార్‌ వాటిని ‘విబ్రాంట్‌ విలేజ్‌’ పథకంతో అభివృద్ధి చేసిందని తెలిపారు. ఈ రాష్ట్రంలో ఇటీవల రూ.17వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. తాజాగా బడ్జెట్‌లో ఉత్తరాఖండ్‌లోని పర్వత ప్రాంతాల్లో రోప్‌వేస్‌ కోసం ‘పర్వతమాల’ పథకాన్ని ప్రతిపాదించినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగానే భాజపా మేనిఫెస్టో ఉందని పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మొదటి దశ ఎన్నికల పోలింగ్‌పై ప్రధాని మోదీ స్పందిస్తూ ‘‘యూపీ తొలి దశ పోలింగ్‌ జరిగిన తీరును గమనిస్తే.. భాజపాకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని తెలుస్తోంది. మాకన్నా.. ప్రజలే భాజపాని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో ఉన్నారు. మంచి ఉద్దేశాలతో, రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే నాయకుల్ని ఓటర్లు వదులుకోరు. ఎల్లప్పుడూ వారికి మద్దతుగా ఉంటారు’’అని మోదీ చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని