Congress: తెలంగాణలో రాష్ట్రపతి పాలన.. కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణలో ఫిబ్రవరి చివరినాటికి అసెంబ్లీ రద్దయి.. రాష్ట్రపతి పాలన రానుందని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. కోదాడలో పార్టీ ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated : 05 Feb 2023 19:07 IST

కోదాడ: కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఈనెల చివరినాటికి శాసనసభ రద్దయ్యి.. రాష్ట్రపతి పాలన రానుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి పాలనలో ముందస్తు ఎన్నికలు జరపాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. రాహుల్‌గాంధీ పాదయాత్రతో దేశంలో కాంగ్రెస్‌ గాలి వీస్తోందన్నారు. భాజపా మతపరంగా దేశాన్ని ఛిన్నాభిన్నం చేస్తోందని విమర్శించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితబంధు, మట్టి, ఇసుక, మద్యం సిండికేటులో కోదాడ ఎమ్మెల్యే కమీషన్లకు కక్కుర్తిపడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కోదాడ, హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్‌కు 50వేల మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను చెప్పిన మెజార్టీ రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఉత్తమ్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని