Amit Shah: ఉగ్రదాడులను కాంగ్రెస్‌ ఏ రోజూ ఖండించలేదు: అమిత్‌షా

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో తరచూ ఉగ్రదాడులు జరిగేవని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. పాకిస్థాన్‌కు చెందిన ముష్కరులు మన సైనికులను పొట్టనపెట్టుకున్నా అధికారంలో ఉన్న ఆ పార్టీ ఏ రోజూ ఖండించలేదని విమర్శించారు.

Published : 27 Nov 2022 01:33 IST

అహ్మదాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో తరచూ ఉగ్రదాడులు జరిగేవని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. పాకిస్థాన్‌కు చెందిన ముష్కరులు మన సైనికులను పొట్టనపెట్టుకున్నా అధికారంలో ఉన్న ఆ పార్టీ ఏ రోజూ ఖండించలేదని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగానే ఆ పార్టీ అలా వ్యవహరించిందన్నారు. కానీ, ప్రధాని నరేంద్రమోదీ హయాంలో అలాంటి ఒక్క ఉగ్రదాడికి ఎవరూ సాహించలేదని పేర్కొన్నారు. 26/11 ముంబయి ఉగ్రదాడి ఘటనలో మరణించిన వారికి శనివారం ఆయన నివాళులర్పించారు. 

‘‘ఇదే రోజు (26/11/2008) పాక్‌ ముష్కరులు మంబయిలో 164 మంది పౌరులను పొట్టనపెట్టుకున్నారు. వారికి నివాళులర్పిస్తున్నా. కాంగ్రెస్‌ హయాంలో ఇలాంటి ఘటనలు తరచూ జరిగేవి. ప్రధాని మోదీ హయాంలో అలాంటి దాడులకు ఆస్కారం లేదు. 2004 నుంచి 2014 మధ్య సోనియా, మన్మోహన్‌ పదేళ్ల పాలనా కాలంలో పాకిస్థాన్‌ ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించి మన సైనికుల తలలను తెగ్గోసేవారు. కానీ ఆ పార్టీ ఒక్క మాట మాట్లాడింది లేదు. కేవలం ఓటు బ్యాంకు కోసం మాత్రమే. కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌ ఏంటో మీకు బాగా తెలుసు!’ అని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రజలనుద్దేశించి అమిత్‌షా వ్యాఖ్యానించారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌, ఎయిర్‌ స్ట్రైక్స్‌ చేపట్టి ప్రధాని మోదీ ఉగ్రవాదులు గట్టి సందేశం ఇచ్చారని గుర్తుచేశారు. నెహ్రూ చేసిన తప్పిదాన్ని (ఆర్టికల్‌ 370)ని తాము సరిచేశామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని