వీగిన అవిశ్వాస తీర్మానం.. గట్టెక్కిన ఖట్టర్‌

హరియాణాలో మనోహర్‌లాల్‌ నేతృత్వంలోని భాజపా- జేజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. తీర్మానానికి అనుకూలంగా 31 మంది సభ్యులు ఓటేయగా.. 55 మంది వ్యతిరేకంగా ఓటేయడంతో......

Updated : 11 Mar 2021 13:27 IST

చండీగఢ్‌: హరియాణాలో మనోహర్‌లాల్‌ నేతృత్వంలోని భాజపా- జేజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. తీర్మానానికి అనుకూలంగా 31 మంది సభ్యులు ఓటేయగా.. 55 మంది వ్యతిరేకంగా ఓటేయడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్‌ ప్రకటించారు. దీంతో ఖట్టర్‌ ప్రభుత్వం అవిశ్వాసం నుంచి గట్టెక్కింది.

ఖట్టర్‌ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందంటూ కాంగ్రెస్‌కు చెందిన విపక్ష నేత భూపీందర్‌సింగ్‌ హుడా సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 90 మంది ఉండాల్సిన అసెంబ్లీలో ప్రస్తుతం 88 మంది సభ్యులు ఉన్నారు. అవిశ్వాసం నుంచి గట్టెక్కాలంటే 45 మంది సభ్యులు అవసరం. అయితే, భాజపాకు 40 మంది సభ్యులు ఉండగా.. జేజేపీకి 10 మంది, స్వతంత్రులు ఐదుగురు, లోక్‌హిత్‌ పార్టీకి చెందిన ఒకరు ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. రైతు చట్టాల విషయంలో అసంతృప్తిగా ఉన్న జేజేపీ.. హుడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తుందని కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది. అయితే, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే చర్యలేవీ తాము చేపట్టబోమని జేజేపీ ముందే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఓటింగ్‌లో పాల్గొనడంతో కాంగ్రెస్‌ తీర్మానం వీగిపోయింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని