రిమోట్ ఓటింగ్‌ను వ్యతిరేకించిన కాంగ్రెస్.. విశ్వాసం కల్పించాలని ఈసీకి సూచన
Congress on Remote voting: ఈసీ ప్రతిపాదించిన రిమోట్ ఓటింగ్‌ను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ముందు ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు, ప్రతిపక్ష పార్టీలకు విశ్వాసం కల్పించాలని ఈసీకి సూచించింది.
దిల్లీ: వలస కార్మికుల కోసం ఎన్నికల సంఘం ప్రతిపాదించిన రిమోట్ ఓటింగ్ (Remote Voting) వ్యవస్థను కాంగ్రెస్ (Congress) పార్టీ వ్యతిరేకించింది. ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు తేవడానికి ముందు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కల్పించాలని సూచించింది. ఈవీఎంల విషయంలో విపక్షాలు లేవనెత్తుతున్న అభ్యంతరాలకు పరిష్కారం చూపాలంది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. వేర్వేరు నియోజకవర్గాలకు వేరే ప్రాంతంలో ఓటింగ్ నిర్వహించడం వల్ల ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం మరింత సన్నగిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.
ఓటింగ్‌లో ఎక్కువ మంది ప్రజలను భాగస్వాములను చేసేందుకు ఈసీ రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌కు శ్రీకారం చుట్టింది. ఒకే పోలింగ్ బూత్ నుంచి వేర్వేరు నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోటో టైప్‌ను రూపొందించింది. దీన్ని ప్రదర్శించేందుకు జనవరి 16న రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. లిఖితపూర్వకంగా అభిప్రాయాలను తెలియజేసేందుకు జనవరి 31 వరకు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో జైరాం రమేశ్ తన స్పందనను తెలియజేశారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం కీలకమన్నారు. ఇప్పటికే ఈవీఎంల విషయంలో అనేక వివాదాలు ఉన్నాయని, వీటికి పరిష్కారం చూపకుండా విశ్వాసం కల్పించడం సాధ్యం కాదన్నారు. మోదీ ప్రభుత్వం ఒత్తిడి కారణంగా ఇటీవల ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోందని ఆరోపించారు.
ప్రధాని మోదీ కోసమే గుజరాత్ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ కావాలనే ఆలస్యం చేసిందని జైరాం రమేశ్ ఈ సందర్భంగా ఆరోపించారు. పోలింగ్ రోజున ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించేందుకు ఫ్రీ పాస్ ఇచ్చిందని దుయ్యబట్టారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం లేవనెత్తినా పట్టించుకోలేదన్నారు. గుజరాత్ ఎన్నికల్లో చివరి గంటలో 10 నుంచి 12 శాతం అనుమానాస్పద ఓటింగ్ నమోదైందన్నారు. కనీసం 60 సెకన్లలో ఓటింగ్ నమోదు అవ్వాల్సిన చోట కేవలం 25-30 సెకన్లకు ఒక్కో ఓటు నమోదైందన్నారు. ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం నెలకొల్పేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు నిర్మాణాత్మక సూచనలు చేస్తూనే ఉందని గుర్తుచేశారు. వీవీ ప్యాట్ల సంఖ్యను పెంచాలన్నది అందులో భాగమేనని, దాన్నీ పట్టించుకోలేదని జైరాం రమేశ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూమా అఖిలప్రియను అడ్డుకున్న వైకాపా నేతలు.. యర్రగుంట్లలో ఉద్రిక్తత
మాజీ మంత్రి, ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియను వైకాపా నేతలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. -
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. -
కొనసాగుతున్న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. -
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్‌కు కాంగ్రెస్ షాక్!
Congress: కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ తాజా లోక్‌సభ అభ్యర్థుల జాబితా నుంచి తప్పించింది. -
ఇంటికి కిలో బంగారం పంచినా జగన్‌కు ఓటమే
అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్‌ను తాడేపల్లి ప్యాలెస్‌లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
నగదు, మద్యం దొరికినా అధికారులు స్పందించరేం?
తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్‌లు దొరికినా.. జిల్లా కలెక్టర్, ఆర్వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం
ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. -
రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
ముందు చెల్లికి సమాధానం చెప్పాలి
బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్... బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిని వెంట బెట్టుకుని బయటకొచ్చారని, అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోక పోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకూ అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. -
రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డికి అసమ్మతి సెగ
‘పరిటాల కుటుంబంతో పోరాటం అన్నది నా ఒక్కడితో సాధ్యం కాదు.. ఇప్పటికే ఒకసారి ఓడిపోయి ఇల్లు అమ్ముకొని రోడ్డున పడ్డానని ప్రకాశ్‌రెడ్డి అంటే ఆయనను ఇంట్లో కూర్చోబెట్టాం..మమ్మల్ని మాత్రం ఆయన రోడ్డున పడేశారు. -
మట్టి మింగేస్తున్నారు.. మనుషుల్ని చంపేస్తున్నారు
‘వైకాపా పాలనలో అక్రమ తవ్వకాలతో మట్టిని మింగేస్తున్నారు.. ప్రశ్నించిన మనుషులనూ చంపేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. -
పవన్‌కల్యాణ్‌తో నాయకుల సమావేశం
ఒంగోలు ఎంపీ, తెదేపా నేత మాగుంట శ్రీనివాసులురెడ్డి.. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో భేటీ అయ్యారు. -
తెలిసే.. వదిలేశారా?
అధికార వైకాపా తాయిలాల పంపిణీలో దూసుకుపోతుంటే తిరుపతి జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్టీల ఉమ్మడి భేటీలు
ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 4న లోక్‌సభ నియోజకవర్గాల స్థాయిలో, 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించాలని తెదేపా, జనసేన, భాజపా నిర్ణయించాయి. -
కేసుల్లోనూ నంబర్ వన్ ముఖ్యమంత్రి జగనే
దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోకెల్లా ధనవంతుడైన జగన్.. కేసుల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నేత దీపక్‌రెడ్డి ఎద్దేవా చేశారు. -
అనంతపురం జిల్లాలో ఘోరం..
అనంతపురం జిల్లా శింగనమల మండల వైకాపా మాజీ కన్వీనర్, అసమ్మతి నాయకుడు పట్నం నగేశ్ మామిడి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. -
భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే
రాష్ట్రంలో పోటీ చేయనున్న పది అసెంబ్లీ స్థానాలకు భాజపా అధినాయకత్వం బుధవారం అభ్యర్థుల్ని ప్రకటించింది. వీరిలో సుజనాచౌదరికి కేంద్ర మంత్రిగా, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డిలకు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించిన అనుభవం ఉంది. -
క్యాష్ కొట్టు.. బస్సులు పట్టు
ఇటీవల వైకాపా నిర్వహించిన నాలుగు సిద్ధం సభలకు 8,700 ఆర్టీసీ బస్సులు తీసుకున్నారు. వీటికి ఆ పార్టీ దాదాపు రూ.20 కోట్ల వరకు చెల్లించింది. -
భాజపా లోక్‌సభ స్థానాలకు ఇన్ఛార్జుల నియామకం
రాష్ట్రంలో భాజపా పోటీ చేస్తున్న లోక్‌సభ స్థానాలకు సీనియర్ నేతలను ఇన్‌ఛార్జులుగా ఆ పార్టీ నియమించింది. వీరిలో నలుగురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. -
డబ్బు తరలించడానికే ఆ కంటెయినర్
అయిదేళ్లుగా అడ్డదారిన ఆర్జించిన రూ.వేల కోట్ల సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటెయినర్లో తరలించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైకాపా అభ్యర్థులకు పంచడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్‌లైన్!