Rahul Gandhi: రాహుల్‌పై అనర్హత వేటు.. పార్లమెంట్‌లో నిరసనలకు కాంగ్రెస్‌ పిలుపు

రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం పట్ల కాంగ్రెస్‌ పార్టీ నిరసనల్ని ఉద్ధృతం చేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన  ఆ పార్టీ.. తాజాగా పార్లమెంట్‌లో సోమవారం తమ పార్టీ ఎంపీలంతా నల్లదుస్తులు ధరించి హాజరుకావాలని సూచించింది. 

Published : 26 Mar 2023 23:45 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్‌లో నిరసనలకు కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. సోమవారం తమ పార్టీ ఎంపీలంతా నల్లదుస్తులతో సభకు హాజరు కావాలని కోరింది. ఈ మేరకు కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి ఎంపీలందరికీ సమాచారం అందించారు. ప్రధాని  మోదీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు ఇటీవల రాహుల్‌కు రెండేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనపై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఆదివారం ‘సంకల్ప్‌ సత్యాగ్రహ’ను చేపట్టింది. దిల్లీలోని రాజ్‌ఘాట్‌ దగ్గర నేతలంతా కలిసి నిరసన దీక్షకు దిగగా.. మరోవైపు, దేశవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని