Updated : 28 Jun 2021 01:17 IST

కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హైకమాండ్‌ ఆగ్రహం

హైదరాబాద్‌: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మాల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని నియమించడంపై వస్తున్న వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ తీవ్రంగా తీసుకుంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించడంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు మాదిరిగానే పీసీసీ ఎన్నిక జరిగినట్లు తనకు దిల్లీ వెళ్లాకా తెలిసినట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో కోమటిరెడ్డి వ్యాఖ్యలపై పార్టీ హైకమాండ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్‌ రాష్ట్ర నేతలకు ఫోన్‌ చేశారు. పార్టీ నేత మల్లు రవికి ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు ఫోన్‌ చేశారు. హైకమాండ్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఉపేక్షించేది లేదని ఠాగూర్‌ పేర్కొన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై పలువురు నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఆంగ్లంలోకి అనువదించి హైకమాండ్‌కు పంపారు. 

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని