Telangana News: కేసీఆర్‌, జగన్‌ కలిసి తెలంగాణను నిండా ముంచారు: రేవంత్‌రెడ్డి

రాష్ట్రానికి 8 ఏళ్లలో తెరాస ప్రభుత్వం చేసింది శూన్యం అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గ్రామ సమస్యలపై పోరాటమే లక్ష్యంగా వికారాబాద్‌ జిల్లా పరిగిలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మన ఊరు-మన పోరు’ బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు....

Updated : 26 Feb 2022 22:27 IST

పరిగి (వికారాబాద్): రాష్ట్రానికి 8 ఏళ్లలో తెరాస ప్రభుత్వం చేసింది శూన్యం అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గ్రామ సమస్యలపై పోరాటమే లక్ష్యంగా వికారాబాద్‌ జిల్లా పరిగిలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మన ఊరు-మన పోరు’ బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణను 8 ఏళ్ళుగా పాలిస్తున్న కేసీఆర్.. బంగారు తెలంగాణ చేస్తున్నామని చెప్పి కబంధ హస్తాల్లో బంధించారని విమర్శించారు. అభివృద్ధి కోసమంటూ తెరాసలో చేరిన వారు ఏం అభివృద్ధి చేశారని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌, జగన్‌ కలిసి తెలంగాణను నిండా ముంచారన్నారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాల కోసం తెలంగాణను సాధించుకుంటే.. ఇప్పుడు నీళ్లు ఏపీకి, నిధులు గుత్తేదారులకు, నియామకాలు కేసీఆర్‌ ఇంట్లో మాత్రమే జరిగాయని ఆరోపించారు.

‘‘ఈ ప్రాంతానికి రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తెచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి పాలమూరు-రంగారెడ్డి జీవో ఇచ్చారు. ప్రాణహిత ప్రాజెక్టును చేవెళ్లకు రాకుండా అడ్డుకున్నది కేసీఆర్ కాదా?యాదగిరి గుట్టలో ప్రమాణం చేసి చెవుతారా కేసీఆర్..?గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లను ఏ దేవుడు పాలిస్తున్నాడు. ఈ ప్రాంతాన్ని ఏ దెయ్యం పాలిస్తుంది. పాలమూరు-రంగారెడ్డిని ఆపుతామని ఎన్జీటీలో అఫిడవిట్‌ ఇచ్చారు. మూడేళ్ళ కిందనే పాలమూరు-రంగారెడ్డి పూర్తి చేసి ఉంటే ఇవాళ ఇలా గొంతులు ఎండేవా? ఇప్పుడేమో దేశానికి ప్రధాని చేయమంటన్నారు. రాష్ట్ర ప్రజలు ఇకపై కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. కేసీఆర్‌ యాసంగి వడ్లు కొనకపోతే ఊరుకునేది లేదు’’ అని రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు